Popular Posts

Saturday, 15 October 2011

TV-9 KU TAGANI PANI

                         తెలుగు చానళ్లలో TV -9 కు ఒక ప్రత్యేక స్థానం UNNADI.రాశి ఫలాలు,వాస్తు విశేషాలు ..వంటి తర్కానికి నిలువని అంశాలను ప్రసారం చేయదు కాని,ఆశ్చర్యంగొలిపే....అవాంచనీయప్రసారాన్ని..ఒకదానిని మాత్రం ప్రతిసారీ ప్రసారం చేస్తుంది.అది .....ఇస్రో ఉపగ్రహ వాహన నౌక కక్ష్యలోనికి ఉపగ్రహాలను తీసుకొని వెళ్ళే ప్రతిసారీ రఘునందన్ అనే శాస్త్రవేత్తతో ,శ్రీధరాచారి అనే జ్యోతిష్య శాస్త్రవేత్తతో ముఖాముఖి ఏర్పాటు చేయడం.వారిరువురు తమ తమ వాదనలను వినిపిస్తుంటారు.శ్రీధరాచారిగారైతే కోపతాపాలకు లోనై శాస్త్రవేత్తలను దూషిస్తుంటారు.
                          ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ TV9 ఏ సామాజిక చైతన్యాన్ని సాదిన్చదలచుకోన్నది?సమాజంలో శాస్త్రవేత్తలపట్ల అపనమ్మకాన్ని,అగౌరవాన్ని పెంచడం తప్ప !!
                         ఒక్కసారి ..DECEMBER2010 లో ...శ్రీధరాచారి గారు చెప్పినట్టుగానే ఉపగ్రహ వాహన నౌక ప్రయోగం విఫలమైంది.అంతమాత్రాన ,గ్రహాల అననుకూల స్థితి కారణంగా జరిగినట్టా?!
                         మొన్నటికి మొన్న ..12OCTOBER 2011 ,బుధవారం నాడు PSLV C 18 --4 ఉపగ్రహాలను తీసుకొని వెళ్ళడానికి 4 -5 నిమిషాలకు ముందు అవాకులు ,చవాకులు పలికారు "అశుభం"అని ఆశీర్వదించారు . ఏమైంది?ప్రపంచ శాస్త్రవేత్తలతో "భేష్" అనిపించుకోలేదా?!
                         మొత్తం 20 సార్లు ప్రయోగిస్తే రెండేరెండు సార్లు విఫలమైంది .అయినా భారత దేశం లో హిందూ,ఇస్లాం,క్రయిస్తవ,సిక్కు,బౌద్ధ,జైన,జోరాస్ట్రియన్ మతస్తులు ఎందఱో ఉన్నారు.
                         ఒక్క హిందూ మత జ్యోతిష్య శాస్త్రవేత్త అభిప్రాయాన్నే సర్వ జనులకు వర్తించే అంశానికి జోడించడం సబబా?!tv9 ఆత్మపరిశీలన చేసుకోవలసిన అగత్యం లేదా ?!

 

1 comment:

  1. Tv9 ఒక హేతువాద ప్రసార సాధనం.. హిందువుల సంస్కృతి సంప్రదాయాల పైన మాత్రమే తన ద్రుష్టి పెట్టి వాటిని వక్రీకరించి చూపే నిరంతర ప్రసారాల స్రవంతి. మిగతా మతాల జోలికి గాని, వాటి విషయాల జోలికిగానీ Tv9 వెళ్ళదు. ఒకవేళ వెళితే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. TRT రేటింగ్స్ కోశం కక్కుర్తిపడి, పాలు తాగిన రొమ్మునే ఇది అపవిత్రం అంటూ నిందవేసే నీచ స్థితికి దిగజారిపోయిన ఒక తెలుగు నికృష్ట ప్రసార మాధ్యమం. సమాజం మీద చేయాల్సిన తిరుగుబాటుని పక్కకి వదిలేసి మైండ్ దొబ్బి ఇలా పెడదారి పట్టింది. అసలే ఆలనా పాలనా లేక ఎంతో అద్భుతమైన విఙానం ముసలిదై చిక్కి మూలనపడిపోతుంటే దాన్ని వెలుగులోకి తేవాల్సింది పొయి ఎవరో కాలక్షేపంగాని నలుగుర్ని (హేతువాదులని) తీసుకొచ్చి , మీరు అడిగిన ప్రతీదానికీ ఆ నలుగురూ పలికిన పలుకులే నాలుగు వేదాలని నమ్మబలకే మిమ్మల్ని హైందవ విద్రోహులనిగాక ఇంకేమనాలి..

    ReplyDelete