Popular Posts

Wednesday, 21 September 2011

PRAPANCHA SHANTHI DINOTSAVAM :SHANTHI ENDUKU KORAVADUTUNNADI

          ప్రతి ఏటా ,నేడు [21 SEPTEMBER] ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడం,తత్సంబంధంగా ఒక ప్రతిజ్ఞ చేయడం ఒక తంతుగా మారిపోయింది .
          శాంతి ఎందువల్ల కరువవుతున్నదని ఒక సారి స్థాలీ పులాక న్యాయంగా అవలోకనం చేసుకోవలసిన అగత్యం ఉన్నదేమో అనిపిస్తుంది .
          భారత దేశం  ఎన్నో వేల ఏళ్ల క్రితమే శాంతి మంత్రాలను విశ్వ జనులకు వినిపించింది.నిత్యకృత్యాలలో భాగంగా చేసింది.కాలక్రమేణ వేద సంస్కృతి కనుమరుగై ....అంతమై పోయినందున ,ఋ షులు ప్రవచించిన సదుపదేశ అంశాలూ ఆచరణనుండి  దూరమైనాయి .
           మానవుల మధ్య శాంతిని కాంక్షించడమొక్కటే కాదు ...."ద్యౌః శాంతిరంతరిక్ష........శాన్తిః "అన్న మంత్రం ద్వార ఆకాశము,అంతరిక్షము,పృథ్వీ,నీరు,ఓషధులు ,వనాలు,దేవతలు ,బ్రహ్మ ...సర్వము శాంతితో ఉండుగాక !అని ఆకాంక్షించారు.ఇదీ మన పూర్వీకుల దూర దృష్టి .
           మనం ,మన కోరికలకు కళ్లాలు వేయక అత్యాశ {దురాశ }తో అవసరాలకు మించి వాడుకుంటూ ,కలుషితం చేస్తూ పైన చెప్పుకున్న ప్రతిదానిని "అశాంతి "కి గురిచేస్తూ మనం కూడా అశాన్తిపరులమైపోతున్నాము .
           ప్రకృతిలోని అశాంతి మానవాళి శారీరక ,మానసిక శాంతిపై పరోక్ష ,ప్రత్యక్ష ప్రభావాలను చూపుతున్నది.అది క్రోధానికి .......చివరకు బుద్ధినాశనానికి ....సర్వం నాశనానికి దారి తీస్తున్నది.
           కనుక,ఐక్యరాజ్య సమితి ,అగ్రరాజ్యాలు,వర్ధమాన దేశాలు తమ పౌరులచేత యుద్ధానికి పాలు పడము అనియు,శాంతిని పరిరక్షిస్తామనియు ప్రతిజ్ఞ చేయించడమే కాదు ...పై అంశాల పరిరక్షణ కొరకూ ప్రతిజ్ఞ చేయించాలి,ఆచరించి చూపాలి .
                     సర్వేజనాస్సుఖినో భవంతు !!!!ఓం శాన్తిః    శాన్తిః   శాన్తిః 
**********************************************************************************