ఓహ్!కొంపలేవో కాలిపోతున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ."ఆడలేక మద్దెల ఓడు "అంటున్నారు.అసలు మేము తరతరాలుగా వస్తున్న మా పార్టీ అధినేతల మనోభావాలను అర్థం చేసుకొని వాటిని మించి పో తూ వారి ఆత్మలకు కూడా ఆనందాన్ని చేకూర్చే పనులను చేస్తున్నాము కదండీ !ఇందులో తప్పేమిటో మాకు అర్థం కాదు .
"పాతచింతకాయ పచ్చడి "భావాలు కలిగిన గాంధీగారిని తెల్ల దొరల అండతో మా నాయకుడు నెహ్రు ఏనాడో పక్కన పెట్టి ,సర్దార్ పటేల్ ను కాదని తానే ప్రైం మినిస్టర్ అయ్యాడు గాంధీ అలిగిపోయి కలకత్తాలో ఉండిపోయాడుగాని 15AUGUST 1947 నాడు ఫెస్టివల్ కు వచ్చాడా!మా నెహ్రూ లెక్కపెట్టాడా! అదండీ రాజకీయ నాయకునికి ఉండవలసిన తెగువ, సాహసం, నిస్సిగ్గుతత్వం .
అయ్యా! రాజకీయాలలో 'మడికట్టుకోని కూర్చుంటే ' కుదరదు. గద్దె కోసం మేమే దో చేస్తున్నామని గోలగోల చేస్తారెందుకు ?రామాయణ ,భారత కాలంనుండి వస్తున్నదే మేమూ ఆచరిస్తున్నాము .హిందూ రాజులు ,మొఘలాయీలు,తెల్లదొరలు చేసిందే కదా మేము అనుసరిస్తున్నాము.
కాన్సెప్ట్ అర్థం కాక చేతకాని దద్దమ్మలు ఏదో వాగుతుంటారు. {ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్ని మొరగవు?!}
లక్ష్యం ,మార్గం రెండూ ఉత్తమమైనవిగా ఉండాలని సర్వసంగపరిత్యాగి గాంధీ అన్నాడు.
లక్ష్యసాధనలో నీవు ఏది అనుకుంటే అది చెయ్యి అని మా నెహ్రూ,ఇందిరా,రాజీవ్,సోనియా మాకు ఉగ్గు పాలతో నేర్పారు.
ఇంత చెప్పినా అర్థం చేసుకోకపోతే మీ ఖర్మ .చావండి .
ఇట్లు ...సదరు కాంగ్రేసు నాయకులు