Popular Posts

Tuesday, 3 May 2011

బ్రాహ్మణానాం అనేకత్వం అంటారు .ఆర్థిక ,సాంఘిక,సాంస్కృతిక,వైదుష్య,సిద్ధాంత, ప్రాంతీయ, రాజకీయ ....తదితర అంశాలు కారణాలుగా తరతరాలుగా ,శాఖోపశాఖలుగా విభజనలు చేసుకొని 'నన్ను ముట్టకు నా ....కాకి' అనుకునే (అనే) బ్రాహ్మణులలో భావ సమైక్యతను సాధించడానికి ఎవరు దిగిరావాలి? ఈ విషయాలన్నింటిని కూలంకషంగా తర్కించి ,బ్రాహ్మణ మేధావి దివంగత పి.వి .నరసింహారావు గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 'ప్రైవేటీకరణ 'అనే సంస్కరణను ప్రవేశపెట్టి భారత ఆర్థిక స్థితిని మెరుగుపరచడం తో పాటు బ్రాహ్మణ సమాజానికి పరోక్షంగా ఉపకారం చేశారు. భారత జాతి శత,సహస్రాబ్దాలుగా విభిన్న జాతులు,మతాలూ,కులాలు,ఉపకులాలుగా విడిపోయి ఉన్నందున భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లను తగ్గించడం లేదా తొలగించడం అసాధ్యం అని నిశ్చయించుకొనే ,మధ్యే మార్గంగా 'ప్రైవేటీకరణను ఆయన అమలు పరచాడనడంలో ఎవరికీ సందేహం ఉండదని భావిస్తాను. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలలోనూ ప్రభుత్వ ఉద్యోగాలలోనూ రిజర్వేషన్లు కల్పించాలని వాదనలు ,ఉద్యమాలు ప్రారంభమైన తరుణంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ,సదుపాయాలూ సాధ్యమేనా ? "పదుగురాడు మాట పాటియై ధరజెల్లు ,ఒక్కడాడు మాట ఎక్కదు ఎందు ---కదా! అత్యల్ప సంఖ్యాకులైన బ్రాహ్మణుల" మాట "అరణ్య రోదనము కాదంటారా! నందోరాజా భవిష్యతి ...ఒక వేళ---ఐతే --గియితే --మనకు లభించేది ..శుష్కప్రియాలు -శూన్యహస్తాలు మాత్రమే అనడం నిస్సందేహం . కనుక,ఎవరో వస్తారని ,ఏదో చేస్తారని ఎదురు చూస్తూ మోసపోక ,స్వంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడాలి . చీకటిని తిడుతూ కూర్చోకుండా చిరు దీపాన్ని వెలిగించాలి . కలవారు లేనివారికి -----బ్రాహ్మణులకు ,బ్రాహ్మణ ఉద్ధరణ సంస్థలకు ఆర్థికంగా సహాయపడాలి .విద్యాదానం ,విజ్ఞానదానం చేసి సన్మార్గంలో నడిపించాలి .ధైర్య వచనాలతో వెన్ను తట్టాలి .సాంత్వన వచనాలతో ఓదార్చాలి. ఇలా ఎవరికి వారు ,ఎక్కడికక్కడ తమ కు తోచిన రీతిలో ముందడుగు వేస్తే సమీప భవిష్యత్తులో కాకపోయినా ,దీర్ఘ భవిష్యత్తులోనైనా బ్రాహ్మణుల స్థితిలో మార్పు వస్తుందని నా అభిప్రాయం :ఆశ "స్వస్తి ప్రజాభ్యః .............బ్రాహ్మణాః సంతు నిర్భయాః..........శరదాం శతం " ఓం స్వస్తి **********


No comments:

Post a Comment