జన విజ్ఞాన వేదిక కు పుట్టపర్తి సాయి బాబా కేవలం మాన్త్రికునిలాగా మాత్రమే కనిపించడం దురదృష్టకరం .ఇది ఆ వేదిక యొక్క హ్రస్వద్రుష్టిని మాత్రమే సూచిస్తుంది;జనం లో ఉన్న స్థాయిని తగ్గిస్తుంది.అన్ని కోణాలనుండి తర్కించుకొని వ్యాఖ్యానిస్తే సబబుగా ఉండేది .
సాయి బాబా ను కేవలం మాయలు,మంత్రాలు ఉన్నందున జనం అభిమానించాలేదన్న వాస్తవాన్ని ఎవ్వరు కాదనలేరు .అలా మాయలు ,మంత్రాలు చేస్తున్న వారికి ఏస్థాయిలో గుర్తింపు ఉన్నదో తెలిసిందే!
'మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపినందుననే ఆ గౌరవం.
ఇక త్రివర్ణ పతాకాన్ని కప్పడం ----ఎంతో మందికి పతాకాన్ని కప్పి గౌరవించిన సందర్భాలను ఒక్క పర్యాయం జ్ఞప్తికి తెచ్చుకుంటే జుగుప్స కలుగక మానదు.వారిలో దేశాన్ని దోచుకున్న వారూ ఉన్నారు,అపరిమితమైన స్వార్థ చింతన ,పదవీ లాలస మరెన్నో దుర్లక్ష్ణాలు ఉన్న సో కాల్ల్డ్ నాయకులు ఉన్నారు.
జగమంతా తన కుటుంబమే అని నమ్మిన సాయి బాబా కు భారత పతాకాన్ని కప్పి గౌరవించడం తప్పా!
గమనిక:- నేను సాయి భక్తుణ్ణి అనుకునేరు సుమా!
No comments:
Post a Comment