Popular Posts

Wednesday, 11 May 2011

"SHIKHARAYAMANAMAINA ADHIKARULU--SIGGUMALINA NETHALU"

                                        నోరున్నది కదా యని ,భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది కదా యని మంత్రి రవీంద్రారెడ్డి ,ఎం ఎల్ ఎ వీర శివా రెడ్డి అధికారులపై , కడప లో ఓటమి తథ్యం అన్న నేపథ్యం లో ,హద్దు,పద్దు లేకుండా నిరాధారంగా మాటలు ఒలకబోసుకుంటున్నారు.
                                         కడప ఎన్నికలు అంటే ,కత్తులు,కక్షలు,కార్పణ్యాలు,కుట్రలు అని ముద్ర పడియున్న నియోజకవర్గం లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయంటే ,అధికారుల విధి నిర్వహణ ఎలా ఉన్నదో స్పష్టమవుతున్నది.ఏమాత్రం  అశ్రద్ధ వహించినా అన్ని పార్టీల కార్యకర్తలు క్షతగాత్రులు కావడమో ,పరలోక ప్రయాణం చేయడమో జరిగివుండేది  కాదా! 
                                        తమ  మంత్రుల,ఎం.ఎల్.ఎ.ల నోటిని కట్టడి చేయడానికి ముఖ్య మంత్రి గాని కాంగ్రెస్ అధిష్థానం గాని లవ లేశం ప్రయత్నించలేదు.ఇది సబబా !
                                        ఆవు చేలలో మేస్తే దూడ గట్టుపై మేస్తుందా!ఒకరోజు రానే వస్తుంది --"నీవు నేర్పిన విద్యయే  నీరజాక్షా "అని వీరినే వారి కార్యకర్తలే దూషించే రోజు.
                                         ఈ విషయం లో కడప కలెక్టర్ ,రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ,ఉద్యోగులు శతథా అభినందనీయులు.కేంద్ర ఎన్నికల సంఘం" డోంట్ కేర్ "అనడం ప్రశంసనీయం .
                                      "  శేషన్"పడగ విప్పి బుస్సుమన్న నాడు రాజకీయ ఎలుకలు కలుగులలోనే దాగి ఉండి పోయాయి.
**మన దేశ రాజకీయాలకు శేషన్ వంటి వారే తగుదురేమో!!

No comments:

Post a Comment