Popular Posts

Thursday, 14 February 2013

O GANDHEE !

 ఓ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ !
నేతాజీ,పటేల్ ,నెహ్రు ,గోఖలే,జిన్నా,ఆజాద్ ....ఇలా మా నోటినుండి వెలువడగానే వారి  పేర్లను మా పిల్లలు చెప్పేస్తున్నారయ్యా !
అదేమిటోగాని .."గాంధి"అనగానే ..ఇందిరాగాంధీ యా ,రాజీవ్ గాంధీ యా ,సోనియా గాంధీ యా ,రాహుల్ గాంధీ యా ,ప్రియాంక గాంధీయా ,సంజయ్ గాంధీయా అని అడుగుతున్నారయ్యా !
"మహాత్మా" అనగానే ..జ్యోతీరావు పులే అంటున్నారయ్యా !
"జాతిపిత ",ఫాదర్ ఆఫ్ నేషన్ అని అడిగితే ...అటువంటి వారినెవరిని భారత ప్రభుత్వం గుర్తించలేదు అని సమాధానం వస్తున్నది.
"బాపు "అనగానే ,,శ్రీరామ రాజ్యం సినిమా చూసాం అంకుల్ అంటున్నారు .
చేతిలో కర్ర ,కళ్ళద్దాలు ,చిన్న పంచె,పైన కండువా ,వేలాడుతూ నడుముకు ఒక చిన్న గడియారం బోసినవ్వు ఉంటాయి చూడండి అనగానే .......ఓ !.......గాంధీ  తాతా !!..అంటున్నారు.
నిన్ను గురించి వర్ణిస్తే తప్ప చెప్పలేక పోతున్నారు .
"నన్ను వర్ణిస్తున్నారు " అని మురిసిపోతున్నావా !
"మరచి పోయారు " అని బాధ పడుతున్నావా !
అంత మురిసి పోవద్దు .మేము గనుక వర్ణించి అడుగగలుగుతున్నాము .ముందుముందు ఎవడుంటాడు నిన్ను వర్ణించడానికి !!??లేదా నీ ఫోటోలు చూపించడానికి!?నీ చరిత్ర చెప్పడానికి !?
[ 30 జనవరి ,నేడు మహాత్మా ,జాతిపిత ,బాపు వర్ధంతి  ]


No comments:

Post a Comment