"వినసొంపు "తెలుగును "వినకంపు" తెలుగుగా మార్చుతున్న కొంతమంది సినీ గాయకులు ,Tv Anchors,సీరియళ్ల నటులు
ఏ భాషాధ్వనులు ఆ భాషకు స్వంతం .పరభాషను పలికేటప్పుడు సరిగ్గా అదే ధ్వని రావడం సాధ్యం కాకపోవచ్చు.కాని ,తనభాషను 'కృతకంగా' మాట్లాడడమే కొంతమంది తెలుగువారి ప్రత్యేకం దానివల్ల తియ్యని తెలుగు తన మాధుర్యాన్ని కోల్పోతున్నది .కోట్లాది రూపాయలు ఖర్చుచేసి TV Channels ను నడుపుతున్నవారు ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహించి సుశిక్షితులుగా తీర్చిదిద్ది ,Anchors గా ఉంచాలి.ఆ స్పృహ నే లేకుండా వయసు,అందం,వేగం మొదలగు అప్రధాన విషయాలనే పరిగణన లోనికి తీసుకొని ,నియమించి మనమీదికి వదలుతున్నారు .సినీ గాయకులూ .సీరియళ్ల పాత్రధారులు అంతే.వారి ఉచ్చారణ నే ఆదర్శంగా తీసుకుంటున్న మన పిల్లలు అదికాదని చెప్పినా వినడం లేదు.
ఉదాహరణకు కొన్ని ధ్వనుల ఉచ్చారణ ను పరిశీలిద్దాం .
1.దంతముల సహాయముతో పలికే చ ,జ లను పూర్తిగా వదిలేశారు.దవడల సహాయం తో పలికే చ , జ లనే పలుకుతున్నారు [.దవడలతో పలికే చందమామ ,రాజు హిందీ లో అయితే సరియైనదే .]
2.ణ ను న గా
3.ళ ను ల గా
4.శ ను ష గా లేదా స గా పలుకుతున్నారు
5.ఫ ను pha గా కాకుండా fa గా పలుకుతున్నారు.మన భాషలో fa లేదు .ఉర్దూ,ఫార్సీ,ఇంగ్లిష్ లో అయితే సరియైనదే .
6. ఒత్తులు పలుకకపోవడం ,పలికినా సరియైన స్థానం లో పలుకక పోవడం మొదలగునవి .
@చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వీరి మధురమైన గొంతుకలలో తెలుగు తీపి ఇంకా పెరుగదా !!! శుభం భూయాత్ !!!
No comments:
Post a Comment