Popular Posts

Thursday, 14 February 2013

Tv 9 tho Gaadida

          Tv 9  తో గాడిద :-
                      *****
   అరె ..ప్రతి రోజూ "కట్నం అడిగేవాడు గాడిద "అంటూ చూపుతారెంటండీ !ఆ వెధవను,ఆ చవటను ,ఎందుకూ పనికి రాని వాడిని ,పరాన్న భుక్కును ,పక్కా సోమరిపోతును ,చట్టాలను ఉల్లంఘించే వాణ్ని నాతో పోల్చడమేమిటండీ !
    నేను సమాజానికి ఎంత సేవ చేస్తున్నానో తెలియదా !మరచిపోయారా !మీరూ కృతఘ్నుల జాబితాలో చేరి పోయారా !
*చాకి రేవుకు మాసిన బట్టలను మోసేదెవరు ?
*వడ్దర శ్రమ కోర్చి కంకర కొడితే దాన్ని మోసేదెవరు ?
* రోళ్లను ,ఇసుకను మోసి మీ ఇంటిదాకా తెచ్చేదెవరు ?
*ధాన్యాన్ని ,ఇసుకను ఒక ఊరినుండి మరొక ఊరికి చేరుస్తున్నదెవరు ?
*సిగ్గు మాలి ,నా చేత స్మగ్లింగ్ కూడా ...ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి చేయిస్తారు గదా !ఆత్మను చంపుకొని ,కుక్కిన   పేనులా పడి ఉంటున్నానే ...దానికేమంటారు ? 
*నాపై స్వారీ చేసి పోటీలలో కూడా పాల్గొంటారు కదా !
*ఆఖరికి ...పర్వత శ్రేణుల పై శ్రమ కోరుస్తూ మిమ్మల్ని దైవ క్షేత్రాలకు మోస్తానే !
*వసుదేవుని అంతటివానికి సహకరించానే ....
అటువంటి నన్ను ఒక నీచునితో,నికృష్టునితో పోల్చడం ..అసమంజసం ...అన్యాయం ...అధర్మం ....ఇది మీకు పాడికాదు >


No comments:

Post a Comment