Popular Posts

Thursday, 14 February 2013

జరుగుతున్న అఘాయిత్యాలకు సినిమాలు,చానళ్ళు ,క్లబ్బులు,పబ్బులు కూడా కారణం కావా !!?
                                                          ***
    
   ఒక విషయం విన్నదానికంటే ,చూసింది అతి ప్రబావవంతమైనది కదా !అందుచేతనే పాపకు బుద్ధి తెలిసినప్పటి నుండి ,ఇంట్లో,బడిలో దృశ్యానికే ప్రాధాన్యం .కోర్టు తీర్పులోనైనా దృశ్యానికే విలువ కదా !
*సినిమా హీరోలు ,హీరోయిన్లు విలువల కంటే విత్తానీకే విలువనిస్తూ విలువలకు మంగళం పాడేస్తూ ...హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలతో ,ఐటమ్ సాంగ్స్ తో యువతీ యువకులను అధః పాతాళానికి పంపుతున్నారు కదా !దీనిపైన ఏ అంకుశమో లేదు .
*పేరుకు వార్తా చానళ్లు .సినిమా ఐటమ్ గర్ల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు .వాటికి మహిళలే ఆంకర్లు ....ఎంతో ఉత్సాహంగా వ్యాఖ్యానాలు .
పబ్బుల్లో ,క్లబ్బుల్లో జరిగే కార్యక్రమాలను మాటిమాటికి చూపుతూ చివరలో ఏదో ఒక చిన్న వ్యాఖ్య ...అవసరమా !!
*నూతన సంవత్సర వేడుకలు అంటూ చానళ్ళలో వచ్చే ప్రాయోజిత కార్యక్రమాలలో డాన్సులు ,మగువ,మధువు,క్లబ్బులు,పబ్బులు ....ఆఖరికి దూరదర్శన్ నేషనల్ చానెల్ కూడా రాత్రి ఇటువంటి కార్యక్రమమే రాబోతున్నది .
@అత్యంత విచారకరం ఏమిటంటే ..చివరకు face book లో కూడా ప్రేమికుల ఫొటోలు ,వ్యాఖ్యలు ...వగైరా !
@@ప్రేమ అనేది వ్యక్తిగతం .దాన్ని సామాజికం చేసి ,ఆ తరువాత గగ్గోలు పెట్టడం లోని విజ్ఞత ఏ  పాటిది !!!???

O GANDHEE !

 ఓ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ !
నేతాజీ,పటేల్ ,నెహ్రు ,గోఖలే,జిన్నా,ఆజాద్ ....ఇలా మా నోటినుండి వెలువడగానే వారి  పేర్లను మా పిల్లలు చెప్పేస్తున్నారయ్యా !
అదేమిటోగాని .."గాంధి"అనగానే ..ఇందిరాగాంధీ యా ,రాజీవ్ గాంధీ యా ,సోనియా గాంధీ యా ,రాహుల్ గాంధీ యా ,ప్రియాంక గాంధీయా ,సంజయ్ గాంధీయా అని అడుగుతున్నారయ్యా !
"మహాత్మా" అనగానే ..జ్యోతీరావు పులే అంటున్నారయ్యా !
"జాతిపిత ",ఫాదర్ ఆఫ్ నేషన్ అని అడిగితే ...అటువంటి వారినెవరిని భారత ప్రభుత్వం గుర్తించలేదు అని సమాధానం వస్తున్నది.
"బాపు "అనగానే ,,శ్రీరామ రాజ్యం సినిమా చూసాం అంకుల్ అంటున్నారు .
చేతిలో కర్ర ,కళ్ళద్దాలు ,చిన్న పంచె,పైన కండువా ,వేలాడుతూ నడుముకు ఒక చిన్న గడియారం బోసినవ్వు ఉంటాయి చూడండి అనగానే .......ఓ !.......గాంధీ  తాతా !!..అంటున్నారు.
నిన్ను గురించి వర్ణిస్తే తప్ప చెప్పలేక పోతున్నారు .
"నన్ను వర్ణిస్తున్నారు " అని మురిసిపోతున్నావా !
"మరచి పోయారు " అని బాధ పడుతున్నావా !
అంత మురిసి పోవద్దు .మేము గనుక వర్ణించి అడుగగలుగుతున్నాము .ముందుముందు ఎవడుంటాడు నిన్ను వర్ణించడానికి !!??లేదా నీ ఫోటోలు చూపించడానికి!?నీ చరిత్ర చెప్పడానికి !?
[ 30 జనవరి ,నేడు మహాత్మా ,జాతిపిత ,బాపు వర్ధంతి  ]


Tv 9 tho Gaadida

          Tv 9  తో గాడిద :-
                      *****
   అరె ..ప్రతి రోజూ "కట్నం అడిగేవాడు గాడిద "అంటూ చూపుతారెంటండీ !ఆ వెధవను,ఆ చవటను ,ఎందుకూ పనికి రాని వాడిని ,పరాన్న భుక్కును ,పక్కా సోమరిపోతును ,చట్టాలను ఉల్లంఘించే వాణ్ని నాతో పోల్చడమేమిటండీ !
    నేను సమాజానికి ఎంత సేవ చేస్తున్నానో తెలియదా !మరచిపోయారా !మీరూ కృతఘ్నుల జాబితాలో చేరి పోయారా !
*చాకి రేవుకు మాసిన బట్టలను మోసేదెవరు ?
*వడ్దర శ్రమ కోర్చి కంకర కొడితే దాన్ని మోసేదెవరు ?
* రోళ్లను ,ఇసుకను మోసి మీ ఇంటిదాకా తెచ్చేదెవరు ?
*ధాన్యాన్ని ,ఇసుకను ఒక ఊరినుండి మరొక ఊరికి చేరుస్తున్నదెవరు ?
*సిగ్గు మాలి ,నా చేత స్మగ్లింగ్ కూడా ...ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి చేయిస్తారు గదా !ఆత్మను చంపుకొని ,కుక్కిన   పేనులా పడి ఉంటున్నానే ...దానికేమంటారు ? 
*నాపై స్వారీ చేసి పోటీలలో కూడా పాల్గొంటారు కదా !
*ఆఖరికి ...పర్వత శ్రేణుల పై శ్రమ కోరుస్తూ మిమ్మల్ని దైవ క్షేత్రాలకు మోస్తానే !
*వసుదేవుని అంతటివానికి సహకరించానే ....
అటువంటి నన్ను ఒక నీచునితో,నికృష్టునితో పోల్చడం ..అసమంజసం ...అన్యాయం ...అధర్మం ....ఇది మీకు పాడికాదు >


Vinasompaina Telugu nu Vinakampaina Telugu ga maarchavaddu

"వినసొంపు "తెలుగును "వినకంపు" తెలుగుగా మార్చుతున్న కొంతమంది సినీ గాయకులు ,Tv Anchors,సీరియళ్ల నటులు 
                  ఏ భాషాధ్వనులు ఆ భాషకు స్వంతం .పరభాషను పలికేటప్పుడు సరిగ్గా అదే ధ్వని రావడం సాధ్యం కాకపోవచ్చు.కాని ,తనభాషను 'కృతకంగా' మాట్లాడడమే కొంతమంది తెలుగువారి ప్రత్యేకం దానివల్ల తియ్యని తెలుగు తన మాధుర్యాన్ని కోల్పోతున్నది .కోట్లాది రూపాయలు ఖర్చుచేసి TV Channels ను నడుపుతున్నవారు ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహించి సుశిక్షితులుగా తీర్చిదిద్ది ,Anchors గా ఉంచాలి.ఆ స్పృహ నే లేకుండా వయసు,అందం,వేగం మొదలగు అప్రధాన విషయాలనే పరిగణన లోనికి తీసుకొని ,నియమించి మనమీదికి వదలుతున్నారు .సినీ గాయకులూ .సీరియళ్ల పాత్రధారులు అంతే.వారి ఉచ్చారణ నే ఆదర్శంగా తీసుకుంటున్న మన పిల్లలు అదికాదని చెప్పినా వినడం లేదు.
ఉదాహరణకు కొన్ని ధ్వనుల ఉచ్చారణ ను పరిశీలిద్దాం .
1.దంతముల సహాయముతో పలికే చ ,జ లను పూర్తిగా వదిలేశారు.దవడల సహాయం తో పలికే చ , జ  లనే పలుకుతున్నారు [.దవడలతో పలికే    చందమామ ,రాజు హిందీ లో అయితే సరియైనదే .]
2.ణ  ను  న  గా 
3.ళ  ను  ల  గా 
4.శ  ను  ష  గా లేదా స గా పలుకుతున్నారు 
5.ఫ  ను  pha గా కాకుండా fa  గా  పలుకుతున్నారు.మన భాషలో  fa లేదు .ఉర్దూ,ఫార్సీ,ఇంగ్లిష్ లో అయితే సరియైనదే .
6. ఒత్తులు పలుకకపోవడం ,పలికినా సరియైన స్థానం లో పలుకక పోవడం మొదలగునవి .
@చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వీరి మధురమైన గొంతుకలలో తెలుగు తీపి ఇంకా పెరుగదా !!! శుభం భూయాత్ !!!


Wednesday, 2 November 2011

రాజకీయ నాయకుల 'వ్యభిచార 'పద ప్రయోగం ఆక్షేప ణీయం --------------------------------------------------- రాజకీయ నాయకులు ఇతర పార్టీ నాయకులను విమర్శించేటప్పుడు విమర్శగా కాకుండా తిట్ల దండకంగా ఉంటుంది.చీము నెత్తురు లేదా..సిగ్గు లేదా..ఖబర్దార్ ...బిచ్చగాడు...నాలుక చీరేస్తా ...చెయ్యి నరికేస్తా...పందికొక్కు....ఇలా ఎన్నో..ఎన్నెన్నో...అనాలోచితంగా, అప్రయత్నంగా వారి నోట వచ్చేస్తుంటాయి . కాని ,వివిధ విమర్శలలో" వ్యభిచారి " అన్న పదం వాడుతుంటారు.కులాన్ని, జాతిని,వృత్తిని అవమానిస్తున్నారని నిరసనలు తెలుపుతారే...మరి "వ్యభిచారి/ణి " నిఎందుకు నీచంగా భావిస్తూ తిట్లలో వాడుకున్టున్నట్టు?! ఆమాటకొస్తే ,వ్యభిచారిణితో సరితూగే వ్యక్తిత్వం వీళ్ళకు ఉందా ? వ్యభిచారిణి గా మారడానికి సామాజిక ,ఆర్ధిక కారణాలు ఉంటాయి .తెలిసో,తెలియకో ఒకసారి అందులో కాలిడి ,తప్పించుకోలేని స్థితిలో మానసిక క్షోభను.అనుభవిస్తుంటారు.శరీరం రోగాల పుట్ట ...దుర్భర దారిద్ర్యం ....బాధ్యతలు ....చీదరింపులు ...వేధింపులు...ఒత్తిళ్ళు ...ఐన వారికి దూరమైన ఒంటరితనం ...ఇలా ఎన్నో !!! వీటిలో ఏ ఒక్క దాన్ని అయినా వీళ్ళు అనుభవిస్తున్నారా ?! వ్యభిచారిణి, ఈ సమాజం లోని కొందరికి తనను తాను దోచిపెడుతుంటే ...వీళ్ళు ?..సమాజాన్ని దోచుకుంటున్నారు .తరతరాలకు తరగని సంపదను కూడబెట్టుకున్తున్నారు. వందిమాగ ధులతో జై కొట్టించు కుంటున్నారు నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ,వారిని ఇంకా వేదనకు గురి చేయడం అభిలష ణీయమా !నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయం **********************************************************

రాజకీయ నాయకుల 'వ్యభిచార 'పద ప్రయోగం ఆక్షేప ణీయం
---------------------------------------------------------------------
రాజకీయ నాయకులు ఇతర పార్టీ నాయకులను విమర్శించేటప్పుడు విమర్శగా కాకుండా తిట్ల దండకంగా ఉంటుంది.చీము నెత్తురు లేదా..సిగ్గు లేదా..ఖబర్దార్ ...బిచ్చగాడు...నాలుక చీరేస్తా ...చెయ్యి నరికేస్తా...పందికొక్కు....ఇలా ఎన్నో..ఎన్నెన్నో...అనాలోచితంగా, అప్రయత్నంగా వారి నోట వచ్చేస్తుంటాయి .
కాని ,వివిధ విమర్శలలో" వ్యభిచారి " అన్న పదం వాడుతుంటారు.కులాన్ని, జాతిని,వృత్తిని అవమానిస్తున్నారని నిరసనలు తెలుపుతారే...మరి "వ్యభిచారి/ణి " నిఎందుకు నీచంగా భావిస్తూ తిట్లలో వాడుకున్టున్నట్టు?!
ఆమాటకొస్తే ,వ్యభిచారిణితో సరితూగే వ్యక్తిత్వం వీళ్ళకు ఉందా ?
వ్యభిచారిణి గా మారడానికి సామాజిక ,ఆర్ధిక కారణాలు ఉంటాయి .తెలిసో,తెలియకో ఒకసారి అందులో కాలిడి ,తప్పించుకోలేని స్థితిలో మానసిక క్షోభను.అనుభవిస్తుంటారు.శరీరం రోగాల పుట్ట ...దుర్భర దారిద్ర్యం ....బాధ్యతలు ....చీదరింపులు ...వేధింపులు...ఒత్తిళ్ళు ...ఐన వారికి దూరమైన ఒంటరితనం ...ఇలా ఎన్నో !!!
వీటిలో ఏ ఒక్క దాన్ని అయినా వీళ్ళు అనుభవిస్తున్నారా ?!
వ్యభిచారిణి, ఈ సమాజం లోని కొందరికి తనను తాను దోచిపెడుతుంటే ...వీళ్ళు ?..సమాజాన్ని దోచుకుంటున్నారు .తరతరాలకు తరగని సంపదను కూడబెట్టుకున్తున్నారు. వందిమాగ ధులతో జై కొట్టించు కుంటున్నారు
నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ,వారిని ఇంకా వేదనకు గురి చేయడం అభిలష ణీయమా !నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయం
**********************************************************

Monday, 24 October 2011

Facebook

Facebook:

'via Blog this'

POCHARAM KU GELICHESTE UNNA MATHI POYINDI

బాన్సువాడ నియోజక వర్గం నుంచి టి.ఆర్.ఎస్.పార్టీ నుంచి శాసన సభ్యునిగా గెలవగానే పోచారం శ్రీనివాస రావు కు ఉన్న మతి పోయింది.
సెట్లర్స్ తనకు ఓటు వేయలేదని ,తగిన గుణపాఠం నేర్చుకోవలసి వస్తుందని అనడం అజ్ఞానం,అహంకారం,మూర్ఖత్వం మూర్తీభవించిన ప్రకటన .ఆ మాటకొస్తే,తెలంగాణా లో ఎన్నో తరాలక్రిందనే పుట్టిన వారందరూ అతనికే ఓటు వేసారని నిర్ధారణ ఏమిటి?
అసలు అతని బంధువులు,మిత్రులు,కుటుంబసభ్యులు ఖచ్చితంగా అతనికే ఓటు వేసి ఉంటారా!?
   ఒకే రాజకీయ కుటుంబంలో ఉన్నవారు వివిధ పార్టీలలో కొనసాగుతున్నారే!వివిధ సామాజిక వర్గాలు,భిన్న అభిప్రాయాలతో ఉన్న సామాన్య జనం ఒకే పార్టీ కి ఓటు వేస్తారని ఎలా అనుకున్నారు?ఎలా శాసిస్తారు?
   అతనితో పోటీ చేసి ఓటు సంపాదించుకున్న వివిధ వ్యక్తులకు పడ్డ ఓట్ల విశ్లేషణ ఎలా చేస్తారు?
   రాజ్యాంగ బద్ధుడనై మెలగుతానని ప్రమాణ స్వీకారం చేయడానికి యోగ్యుడెలా అవుతాడు ?